Header Banner

వేల కోట్ల రుణాల కుంభకోణం గుట్టు రట్టు! ఆ ప్రముఖ సంస్థపై ఏకకాలంలో 10 చోట్ల ఈడీ దాడులు!

  Wed Apr 16, 2025 12:44        Others

హైదరాబాద్‌లో ప్రముఖ పారిశ్రామిక సంస్థ సురానా గ్రూప్‌ పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మంగళవారం విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించారు. గ్రూప్‌ చైర్మన్‌, డైరెక్టర్లు నివాసాలు సహా సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లో ఏకకాలంలో 10 చోట్ల చెన్నై ఈడీ బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఈ దాడుల్లో సురానా గ్రూప్‌కు అనుబంధంగా పనిచేస్తున్న సాయిసూర్య డెవలపర్స్ కంపెనీపై కూడా దృష్టి పెట్టారు. సంస్థ ఎండీ సతీష్ చంద్ర గుప్తా నివాసంలో సోదాలు కొనసాగాయి. సాయిసూర్య డెవలపర్స్ హైదరాబాద్‌లో పలు కంపెనీలకు భూములు విక్రయించిన వ్యవహారంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సురానా గ్రూప్ గతంలో చెన్నై ఎస్‌బీఐ బ్యాంక్ నుండి వేల కోట్ల రుణాలను తీసుకుంది. 2012లో ఈ గ్రూప్‌పై సీబీఐ కేసు నమోదు కాగా, దర్యాప్తులో 400 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అయితే, సీబీఐ కస్టడీ నుంచి 103 కిలోల బంగారం మాయమవడంతో ఈ వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. మద్రాస్ హైకోర్టు ఈ బంగారం ఏమైందో తేల్చాలని ఆదేశించింది. సురానా గ్రూప్ రియల్ ఎస్టేట్, ఎంటర్‌టైన్‌మెంట్, పవర్ వంటి రంగాల్లో పెద్ద స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడుల పట్ల వ్యాపార వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

భారతీయులకు ట్రంప్ మరో ఎదురుదెబ్బ.. వారికి భారీ షాక్.. ఇక వీసా రానట్లే.! రిజిస్ట్రేషన్ తప్పనిసరి - లేదంటే భారీ జరిమానాలు, జైలు శిక్ష!

తిరుమలలో భక్తులకు వసతికౌంటర్.. టీటీడీ కీలక నిర్ణయం! ఇక బస్సుల్లోనే..!

 

నేడు చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినేట్ కీలక సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ!

 

ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా మళ్లీ ఆయనే ఫిక్స్! వీవీఎస్ లక్ష్మణ్‌కు కూడా..!

 

ఆ కీలక ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్! టెండర్లు మళ్లీ ప్రారంభం!

 

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బిగ్ అలెర్ట్.. రాష్ట్రంలోని 98 మండలాల్లో నేడు వడగాల్పులువానలు - ఎక్కడెక్కడంటే?

 

సీఆర్‌డీఏ కీలక ప్రతిపాదన! వేల ఎకరాల భూమి సమీకరణ! అవి మళ్లీ ప్రారంభం!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! కీలక నేత రాజీనామా! జనసేన పార్టీ లోకి చేరిక?

 

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #EDRaids #SuranaGroup #HyderabadRaids #MoneyLaundering #RealEstateScam